కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ గేమ్ ఆడుతుండగా, సన్నీని కాజల్, సిరి టార్గెట్ చేస్తూ వచ్చారు.ఆయన దాచుకున్న గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేశారు. సిరి కూడా వచ్చి సన్నీ గుడ్లు లాక్కోవడానికి ప్రయత్నించింది.. నేను ఆడవాళ్ల దగ్గరకు వెళ్లను.. దయచేసి వదిలెయ్ అని వేడుకున్నా సిరి వెనక్కి తగ్గలేదు. ప్రియని మించిపోయి చెండాలంగా ఆడింది.
బంగారు కోడిపెట్ట టాస్క్‌లో తొలిరోజే సిరి స్టిక్కర్స్‌ని కోల్పోయిన విషయం తెలిసిందే కదా. అయితే సిక్టర్స్ ఇస్తే.. గుడ్లు ఇస్తావా అని డీల్ కుదుర్చుకున్నాడు. నాలుగు గుడ్లు ఇచ్చింది. ఇక టాస్క్‌లో భాగంగా శ్రీరామ్‌కు స్పెషల్ బ్లూ ఎగ్ లభించింది. దీని ద్వారా ఐదు గుడ్లను పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అందుకోసం ఒకరిని ఎంచుకొని ఆ వ్యక్తితో గేమ్ ఆడాల్సి ఉంటుంది.
శ్రీరామ్ తెలివిగా తనకంటే పొట్టిగా ఉన్న యానీ మాస్టర్ని ఎంచుకున్నాడు. దీంట్లో భాగంగా ఇద్దరి సభ్యులకు ప్రభాకర్, దివాకర్ అనే బాతు బొమ్మలను ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ బొమ్మను చేతుల్లో పట్టుకొని.. కింద పడిపోకుండా ఎవరు కాపాడుకుంటారో వారికే ఐదు గుడ్లు లభిస్తాయి. ఈ గేమ్‌లో యానీ మాస్టర్ గెలిచి, ఐదు గుడ్లను స్వంతం చేసుకుంది. అయితే టాస్క్‌లో ప్రియ ప్రవర్తించిన తీరుపై తెగ విమర్శలు చేస్తున్నారు.