బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తాడో చెప్పడం చాలా కష్టం. నామినేషన్లో ఉన్న వాళ్లని సేవ్ చేస్తాడు. సేవ్ అయిన వాళ్లని తీసుకెళ్లి నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ గేమ్ ఎంతైన థ్రిల్లింగ్ గేమ్ అనే చెప్పాలి. 59వ ఎపిసోడ్లో జరిగిన కొన్ని ట్విస్ట్‌లు హౌజ్‌మేట్స్ మైండ్స్ బ్లాక్ అయ్యేలా చేసాయి. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. మిగిలిన 10 మంది సభ్యులు డేంజర్ జోన్లో పడ్డ సంగతి తెలిసిందే.
మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్లో ఉన్న వాళ్లకు ఇమ్యునిటీ దక్కేలా టాస్క్ ఆడండని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో గెలిచిన వారిలో ఒకరు సేఫ్ కావొచ్చు అని అన్నారు. అయితే ఈ టాస్క్‌కి ‘జీవితమే ఒక ఆట’అనే పేరు పెట్టగా, ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియా మూడు జోన్లుగా విభజించబడింది. బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుంటాయి.
బ్యాగేజ్ జోన్లో కంటెస్టెంట్ల ఫోటోలతో బ్యాగులుంటాయి. వాటిని తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్లోకి రావాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారు డేంజర్ జోన్లోకి వస్తారు. చివరన వచ్చిన కంటెస్టెంట్‌తో పాటుగా వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. అలా ప్రతీ రౌండ్లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు. ఒకరు సేఫ్ అవుతుంటారు. చివరకు ఆటలో మిగిలిన వారు మాత్రమే ఇమ్యూనిటీ దక్కించుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు.