Priyanka Jain | చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో.. వివాదంలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్
Priyanka Jain | బుల్లితెర నటి ప్రియాంక జైన్ (Priyanka Jain) వివాదంలో చిక్కుకుంది.
Priyanka Jain | బుల్లితెర నటి ప్రియాంక జైన్ (Priyanka Jain) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జానకి కలగనలేదు..’, ‘మౌన రాగం’ వంటి సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో మెప్పించి ఏకంగా టాప్-5లో నిలిచింది. ప్రియాంక (Bigg Boss beauty) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌తో కలిసి తరచూ ప్రాంక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంటుంది. ఈ బుల్లితెర నటి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
ప్రియాంక జైన్.. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే, అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేసి నెట్టింట విమర్శలపాలవుతున్నారు ఈ లవ్‌బర్డ్స్. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలిసి రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియోని తిరుమల దారిలో చిరుత ఎటాక్..? అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో వీడియో వదిలారు. చివరికి చిరుత లేదు.. అదంతా ప్రాంక్ (Prank Video) అని నెటిజన్లను ఫూల్స్‌ని చేసేశారు.
ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, శ్రీవారి భక్తులు ప్రియాంక జైన్ జంటపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా..వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
Also Read..
Dhanush | డాక్యుమెంటరీ వివాదంపై కోర్టును ఆశ్రయించిన ధనుష్.. నయన్ దంపతులపై దావా
Keerthy Suresh | 15 ఏళ్లుగా ప్రేమ అంటూ.. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

