Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 విజయవంతంగా ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్లో డబుల్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఫ్లోరా సైనీ, శ్రీజలు ఎలిమినేట్ కావడంతో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌ను వీడినట్టయ్యింది. వీరిలో నలుగురు కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు కాగా, ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీతో హౌజ్‌లో మళ్లీ ఎనర్జీ పెరిగింది.సోమవారం ఎపిసోడ్ మొదలైన వెంటనే హౌజ్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా మొదలైంది.
ముఖ్యంగా దివ్వెల మాధురీ కిచెన్లోనే కెప్టెన్ కళ్యాణ్ తో గొడవకు దిగింది. “కూర్చోపోతే చెప్పరా?” అంటూ వెటకారంగా రియాక్ట్ అవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దాంతో దివ్య , భరణి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. చివరికి మాధురీ కన్నీళ్లు పెట్టుకోవడంతో అసలు డ్రామా మొదలైంది. ఒక్క రోజులోనే ఆమె ‘ఫైర్ బ్రాండ్’ ఇమేజ్ నీరుగారిపోయినట్టైంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ తన స్టైల్లో కామెడీ పంచ్‌లతో నవ్వించాడు. అయితే గార్డెన్ ఏరియాలో రీతూ తో ఆయన సరదాగా ఆడుకోవడం హౌజ్‌లో చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా రమ్య మోక్ష ..దివ్యపై షాకింగ్ కామెంట్ చేసింది. “దివ్య భరణితోనే ఉండటానికే బిగ్ బాస్‌లోకి వచ్చిందా?” అంటూ చేసిన కామెంట్‌తో వాతావరణం టెన్షన్‌గా మారింది. ఈ కామెంట్ల వల్ల బాధపడిన దివ్య .. భరణి–రాము–పవన్ వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. “ఎందుకు నా గురించే మాట్లాడుతున్నారు?” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి, రాము ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం నామినేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకే టర్న్ ఇచ్చారు.
నిఖిల్ నాయర్ – సుమన్ శెట్టి, రాము రాథోడ్లను నామినేట్ చేయగా, చివరికి సుమన్ శెట్టి ఫైనల్ నామినీగా నిలిచాడు.
రమ్య – రాము రాథోడ్, రీతూ, పవన్‌లను నామినేట్ చేసింది. రమ్య ఫైనల్‌గా పవన్‌ని ఉంచింది.
సంజన– రీతూ, భరణిని నామినేట్ చేసింది. భరణి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో చూపించనున్నారు.
లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ వారం నామినేట్ అయిన వారు చూస్తే.. భరణి, సుమన్ శెట్టి , డీమాన్ పవన్, రాము రాథోడ్ , తనూజ , దివ్య అని తెలుస్తుంది. ఆరుగురు నామినేట్ అవ్వడంతో ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌లో హీట్ మరింత పెరిగిపోయింది. కొత్త కంటెస్టెంట్లు, కొత్త వ్యూహాలతో షో మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఎవరి గేమ్ స్ట్రాంగ్ అవుతుందో.. ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.