Bigg Boss 9 | తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి మరింత గ్రాండ్‌గా, కొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ మా ఛానల్ సెప్టెంబర్ 7 నుండి ఈ షో ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ సీజన్లో ప్రత్యేకత ఏమిటంటే, సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు కామన్ మాన్స్కిఈ కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం ‘అగ్ని పరీక్ష’ అనే ప్రత్యేక గేమ్ షో నిర్వహించారు. అందులో పాల్గొన్న 45 మంది నుంచి మొదట 15 మందిని ఎంపిక చేశారు. తర్వాత వారి నుంచి మొదటగా ఐదుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించినా, తాజా సమాచారం ప్రకారం ఆరుగురు కామన్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 కామన్ కంటెస్టెంట్ల లిస్ట్:
దమ్ము శ్రీజ
అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్‌ను చాలా తెలివిగా ఆడిన శ్రీజ, మొదటగా ఎంపికైన కంటెస్టెంట్. ఆత్మవిశ్వాసం, ఫైటింగ్ స్పిరిట్ ఆమె ప్రధాన బలాలు.
మాస్క్ మ్యాన్ హరీష్
టాస్క్ లలో తన విలక్షణమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న హరీష్, తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించడంలో స్పష్టంగా ముందుండటం వల్ల ఎంపికయ్యాడు.
ఆర్మీ పవన్ కళ్యాణ్
సినీ ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమైన ఈ యువకుడు, కమిట్మెంట్ కారణంగా సెలెక్ట్ అయ్యాడు.
ప్రియ శెట్టి
గేమ్‌లో తగిన కాంపిటీషన్ ఇస్తుందని భావించిన నిర్వాహకులు, ఆమెను ఎంపిక చేశారు. ఆమెకి గేమ్ పైన పట్టుదల ఉండడం గమనార్హం.
మర్యాద మనీష్
టాస్క్ గెలవడానికైతే ఏదైనా చేస్తాడు అనే లక్షణం ఉన్న మనీష్‌ను హౌస్‌లో ఆసక్తికరమైన ఆటగాడిగా భావిస్తున్నారు.
హీ మ్యాన్ పవన్
శారీరకంగా ఫిట్నెస్, గేమ్ పైన దృఢమైన అంకితభావంతో ఉన్న పవన్, చివరిగా ఎంపికైన కామన్ కంటెస్టెంట్.
ఈ ఆరుగురు కంటెస్టెంట్ల పేర్లను రేపు సాయంత్రం బిగ్ బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే ఈ లీక్ లిస్ట్ నెట్లో వైరల్ అవుతోంది. షో ప్రారంభానికి ముందే వీరిపై సొషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక బిగ్ బాస్ 9 మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది… కొత్త కంటెస్టెంట్లతో, కొత్త ఎమోషన్స్‌తో, హై వోల్టేజ్ డ్రామాతో ఈసారి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి!