Bigg Boss 9| బిగ్ బాస్ 9 ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 80వ రోజుకు చేరిన ఈ రియాలిటీ షోకు మరో 20 రోజుల్లో ముగింపు పలకనుండగా, చివరి కెప్టెన్సీ రేస్ కోసం పోటీ మరింత హీట్ పెంచుతోంది. ఈ వారం ప్రత్యేక టాస్క్‌ల కోసం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వరుసగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, ఈ రోజు ఎపిసోడ్లో సీజన్ 8 ఫైనలిస్ట్ ప్రేరణ హౌస్‌లో అడుగుపెట్టింది.‘క్రాస్ ఇట్ – రూల్ ఇట్’ పేరుతో ఇచ్చిన ఈ కీలక కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రేరణ ఎవరితో పోటీ పడాలనేది ఆమె ఎంపికపై వదిలేశారు. టాస్క్‌లో తాను తలపడే ప్రత్యర్థిని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రేరణదే కావడంతో, తనూజ తన మాటలతోనే ఆమెను ఛాలెంజ్ చేసింది.
“నువ్వు టఫ్ ప్లేయర్, నీలాంటి వారితోనే ఆడాలి” అని చెప్పడం , ఇద్దరూ కన్నడ కంటెస్టెంట్స్ కావడం కూడా ప్రేరణ తనూజతో టాస్క్ ఆడేందుకు అంగీకరించింది. అయితే టాస్క్‌కి సంచాలక్‌గా దివ్యను నియమించిన బిగ్ బాస్, ఇద్దరి పోటీలో కఠినమైన రూల్స్‌ను అమలు చేశాడు. నిచ్చెన ఎక్కి బాల్స్‌ను కిందకు తెచ్చి సరైన సర్కిళ్లో పెట్టాల్సిన ఈ టాస్క్‌లో, తనూజ విరుద్ధంగా ఆడి దివ్యతో వాగ్వాదానికి దారి తీసింది. రూల్స్‌ను సరిగ్గా ఫాలో చేయకపోవడం, దివ్యతో చిన్నపాటి గొడవ తనూజ గేమ్‌ని డిస్టర్బ్ చేసినట్లు కనిపించింది. చివరకు టాస్క్‌లో ప్రేరణ ముందంజలో నిలిచి గెలుపొందింది. ప్రోమోలో గెలుపు రివీల్ కాకపోయినా, లైవ్ అప్డేట్స్ ప్రకారం ప్రేరణ విజయాన్ని అందుకుంది.
ఆట పూర్తయిన తర్వాత తనూజ, దివ్య చేసిన ఇన్టరాఫరెన్స్ వల్లే తాను ఓడిపోయానని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. చివరి దశలో ఉన్న బిగ్ బాస్ గేమ్‌లో ప్రతి టాస్క్‌కి హౌస్‌లో రగడలు, డ్రామా పెరుగుతుండగా, కెప్టెన్సీ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. తనూజ ఈ సారి కప్ కొడుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు కళ్యాణ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడని అంటున్నారు.