Bigg Boss 8 Telugu | తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్-8 ముగింపు దశకు చేరుకున్నది. రాత్రి 7గంటలకు బిగ్‌బాస్ ఫైనల్ ముగింపు దశకు చేరింది. కార్యక్రమానికి రామ్చారణ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు స్టార్‌మా ప్రోమో రిలీజ్ చేసింది. 8వ సీజన్లో నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాశ్, నభీల్ ఫైనలిస్ట్‌లుగా నిలిచారు. ఇందులో ఎవరు విజేతగా గెలుస్తారనేది కొద్ది నిమిషాల్లోనే తేలనున్నది. గ్రాండ్ ఫినాలేకు బిగ్‌బాస్ సీజన్-8లో ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టంట్స్ హాజరయ్యారు. ఈ సీజన్ విన్నర్ ఎవరు ? అని భావిస్తున్నారని ప్రశ్నించగా.. చాలామంది నిఖిల్, గౌతమ్, ప్రేరణ పేర్లను చెప్పారు. బిగ్‌బాస్-8 సీజన్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.55లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
అలాగే, ప్రైజ్‌మనీతో పాటు విజేతకు బహుమతిగా మారుతీ డాజ్లర్ కారు ఇవ్వనున్నారు. ఫినాలే ఎపిసోడ్లో మాజీ కంటెస్టెంట్స్‌తో నాగార్జున సరదాగా ముచ్చటించారు. ఇక ఫినాలేలో ఆటవిడుపుగా గీతామాధురి, శ్రీకృష్ణ పాటలతో అలరించారు. అలాగే, టాలీవుడ్ హీరోయిన్లు నభా నటేశ్, రాయ్‌లక్ష్మి డ్యాన్సులతో అలరించారు. అలాగే, సీనియర్ నటుడు ఉపేంద్ర హాజరయ్యారు. అయితే, బిగ్‌బాస్-8 సీజన్లో నిఖిల్, గౌతమ్ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా యూ-ఐ మూవీ ప్రమోషన్స్ కోసం ఉపేంద్ర వచ్చారు. ఈ మూవీ విజయవంతం కావాలని నాగార్జున ఆకాంక్షించారు. బీబీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన.. ఉపేంద్ర టాప్-5లో నుంచి ఒక కంటెస్టెంట్‌ను బయటకు తీసుకువచ్చారు. అవినాశ్ ఎలిమినెట్కావడంతో బయటకు వచ్చాడు. దీంతో నలుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఆ తర్వాత ప్రగ్యా జైస్వాల్ బీబీ హౌస్‌లోకి వెళ్లి మరో కంటెస్టెంట్స్‌ను బయటకు తీసుకురానున్నారు.