ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ 5 నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ముందు నుంచి అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 5వ తేదీన ఐదవ సీజన్ మొదలు కానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ 5 తెలుగు షురూ కానుంది. దీని కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. షో మొదలు కావడానికి ఇంకా 14 రోజుల సమయం ఉంది. ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసి ఆగస్టు 26 నుంచి క్వారంటైన్లోకి పంపించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ కోవిడ్ టెస్ట్ నిర్వహించి.. అందులో నెగెటివ్ వచ్చిన తర్వాత.. వాళ్లను క్వారంటైన్లోకి పంపించి.. మళ్లీ బయటికి వచ్చేటప్పుడు ఇంకోసారి టెస్ట్ చేయనున్నారు.
అప్పుడు కూడా నెగటివ్ వస్తే వాళ్లని ఇంట్లోకి పంపించనున్నారు. సేమ్ టు సేమ్ గతేడాది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో.. ఈసారి కూడా అదే రిపీట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే అన్ని విషయాల్లో అభిమానులు హ్యాపీగానే ఉన్నారు.. కానీ ఒక్క విషయంలో మాత్రం నిరాశలో ఉన్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. ఈసారి టైమింగ్స్ విషయంలో ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తుంది. ప్రతిసారి 9:30 నుంచి 10:30 మధ్యలో బిగ్‌బాస్ ప్రసారమయ్యేది. వీకెండ్స్ అయితే 9 గంటలకే మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం మరో అరగంట ఆలస్యంగా మొదలు పెట్టనున్నారు నిర్వాహకులు.
ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్‌బాస్ సీజన్ 5 ప్రసారం కానుంది. ఇది కచ్చితంగా TRP రేటింగ్స్‌పై ప్రభావం చూపించడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంత ఆలస్యంగా షో మొదలు పెడితే చూసే ప్రేక్షకులు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ చూడాలి అని ఆశ ఉన్నా కూడా.. 11 వరకు చూడటం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో షో నిర్వాహకులు మరోసారి పునరాలోచించుకోవాలని అంటున్నారు అభిమానులు. వీకెండ్స్ వరకు ఓకే గాని వీక్ డేస్ మరి ఇంత ఆలస్యం అయితే ఎలా చూడాలి అంటూ సోషల్ మీడియాలో మా యాజమాన్యానికి.. నాగార్జునను ట్యాగ్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. షో మొదలు కావడానికి ఇంకా రెండు వారాలు సమయం ఉంది. ఈ లోపు టైమింగ్స్ విషయంలో నిర్వాహకులు ఏదైనా మార్పు చేస్తారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్‌వాక్.. ఇన్‌స్టాలో కొత్త వీడియో