Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati Sreenu) క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొంత కాలం క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati Sreenu) క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొంత కాలం క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. బోయపాటి శీను కథను సిద్దం చేయడమే కాకుండా కేజీఎఫ్ హీరో యశ్ కు స్టోరీ వినిపించాడని లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే యశ్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్ త్వరలోనే తెరరూపం దాల్చనుందని సమాచారం.
రానున్న రోజుల్లో బోయపాటి-యశ్ సినిమాపై అప్ డేట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. బోయపాటి ముందుగా ఈ కథను రాంచరణ్ (Ramcharan) ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేశాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం బోయపాటి శీను నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ప్రగ్యాజైశ్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. బాలకృష్ణ మరోవైపు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Boyapati sreenu
- Tollywood
- Yash
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

