బిగ్ బాస్ ఫైనలిస్ట్ శ్రీ రామచంద్రకు ఆహా అనిపించే ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్..

Sree Rama chandra in Aha OTT | బిగ్‌బాస్ 5 తెలుగుతో తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు శ్రీరామచంద్ర. ఈయనకు ముందు నుంచి మంచి గుర్తింపు ఉంది. పదేండ్ల కింద ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకుని దేశవ్యాప్తంగా స్టార్ అయ్యాడు శ్రీరామచంద్ర. అక్కడి నుంచి తన కెరీర్ అద్భుతంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం అందుకున్నాడు. నిజానికి అందులో విన్నర్‌గా శ్రీ రామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. నాగార్జున కూడా ఇదే అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా సన్నీ విజేతగా, షణ్ను రన్నర్ గా నిలవగా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు శ్రీరామ్.
ఇక బయటికి వచ్చాక శ్రీరామ్.. ఆహా నుంచి మంచి ఆఫర్ అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆహా మేకర్స్ ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. సంగీత ప్రధానంగా సాగే ఈ షోకు శ్రీరామచంద్ర కంటే బెటర్ హోస్ట్ ఇంకెవరు ఉండరు అంటున్నారు. శ్రీరామచంద్ర 2010లో ఇండియన్ ఐడల్ గా నిలిచాడు. ఆ తర్వాత హిందీ తెలుగులో కలిపి దాదాపు 500 పాటలు పాడాడు. బిగ్ బాస్ 5 తెలుగుతో మరోసారి అందరికీ దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆహా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ
— ahavideoin (@ahavideoIN) December 26, 2021
శ్రీరామచంద్ర యాంకర్ అని తెలిసిన తర్వాత షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న ఈ సంగీత కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. మరి సింగర్‌గా అలరించిన శ్రీ రామచంద్ర హోస్ట్ గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. మరోవైపు ఆయనకు నటుడిగా కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్న తమన్..
RGV on RRR | ఆర్ఆర్ఆర్ మూవీకి ఒమిక్రాన్‌తో లింక్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
Salman Khan | సల్మాన్ ఖాన్‌కు పాముకాటు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
రంగంలోకి చిరంజీవి.. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌తో ప్రత్యేక భేటీ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

