రంగంలోకి చిరంజీవి.. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌తో ప్రత్యేక భేటీ..

మెగాస్టార్ చిరంజీవి మెల్లమెల్లగా ఇండస్ట్రీ పెద్ద అవుతున్నాడు. ఇక్కడ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వానికి ఆయన పెట్టుకున్న అర్జీ మంచి ఫలితం తీసుకొచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎంపీ సంతోశ్ కుమార్ కూడా చొరవ తీసుకొని తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచడంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తో మాట్లాడారు. దీని ఫలితంగా ఇక్కడ రాబోయే సినిమాలకు టికెట్ రేట్లు అదనంగా పెంచుకునే అమ్మొచ్చు అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం విషయంలో ఎక్కువ భాగం క్రెడిట్ చిరంజీవికి వస్తుంది. ఆయనే ముందుండి సినిమా టికెట్ రేట్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చకు తెరతీశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే ఆయన జగన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీని కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మరీ 5, 10, 15, 20, 30 రూపాయల టికెట్ రేట్స్ థియేటర్స్ నడుపుకోలేక స్వచ్ఛందంగా మూసుకున్నారు యాజమాన్యం. సినిమా ఇండస్ట్రీపై కూడా ఇది కోట్ల రూపాయల నష్టం పడేలా చేస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఈ టికెట్ రేట్స్ అసలు వర్కౌట్ అవ్వవు.
ఇదే విషయం కొంతమంది హీరోలు మీడియా ముందు చెప్పారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు అంటూ నాని చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రులు సీరియస్ అయ్యారు. సామాన్యులకు అందుబాటులో సినిమా టికెట్ రేట్లు తీసుకొస్తే మీకు అవమానించినట్లు ఉందా అంటూ నానిపై మాటల తూటాలు పేల్చారు ఏపీ మంత్రులు. ఈ నేపథ్యంలోనే ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి టికెట్ రేట్స్ పై మాట్లాడటం లేదు. అందుకే చిరంజీవి చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జగన్ చిరంజీవి భేటీ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ మీటింగ్ అయినా సక్సెస్ ఫుల్ గా జరుగుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్న తమన్..
RGV on RRR | ఆర్ఆర్ఆర్ మూవీకి ఒమిక్రాన్‌తో లింక్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
Salman Khan | సల్మాన్ ఖాన్‌కు పాముకాటు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

