ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్‌నీల్ ఇంటెన్స్ టేకింగ్ కలిస్తే తెరపై వండర్స్ క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుకానుంది.
ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్వేశారని, వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా తొలుత పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ భాగం కావడం లేదని, మార్చిలో ఆయన షూట్లో జాయిన్ అవుతారని తెలిసింది. ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో ఈ పాన్ఇండియా చిత్రాన్ని తెరకెక్కించనుంది. రవిబస్రూర్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.