బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన ఎన్టీఆర్ తన సత్తా ఏంటో చూపించాడు. బిగ్ బాస్‌ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ఉంచిన జూనియర్ ఈ షో అందరికి దగ్గరయ్యేలా చేశాడు. తర్వాతి సీజన్స్‌కి ఎన్టీఆర్‌ని కొనసాగించాలని నిర్వాహకులు భావించినప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ వలన నో చెప్పారు. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో ఎన్టీఆర్ ఈ నెల 22వ తేది నుండి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. 22వ తేదిన కర్టన్ రైజర్ జరగనుండగా, ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా పాల్గొననున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇది నందమూరి అభిమానులతో పాటు మెగా అభిమానులని ఎంతగానో అలరిస్తుంది.
ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ను మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా రేంజ్లో ఈ షోని ప్రమోట్ చేస్తున్నారు. వాల్ పోస్టర్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ఈ షోకి ఓ రేంజ్లో ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ ప్రోమోలో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.