బిచ్చగాడు..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన కోలీవుడ్ (Kollywood) సినిమా. తెలుగు, తమిళంతో వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్ ఆంటోనీ (Vijay Anthony) హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించాడు. సత్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఈ క్రేజీ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కు అంతా సిద్దమైంది.
బిచ్చగాడు 2 (Bichagadu 2) ఇవాళ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. చెన్నైలో బిచ్చగాడు 2 షూటింగ్ మొదలు కానున్నట్టు టాక్. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీయే డైరెక్ట్ చేస్తుండటం విశేషం. నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఆసక్తికర విషయమేంటంటే సీక్వెల్ లోని కొంత భాగాన్ని హైదరాబాద్ లో కూడా షూట్ చేయనున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చిత్రయూనిట్ పూర్తి చేసిందని టాక్. మరి ఆల్ టైమ్ ఫేవరేట్ చిత్రాల్లో చేరిపోయిన బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ ను విజయ్ ఆంటోనీ ఏ స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తాడో చూడాలి.
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్