ముంబై : మహారాష్ట్రలోని 358 తాలూకాలకు గాను 265 తాలూకాల్లో ఈ ఏడాది తగినంత వర్షం పడకపోవడంతో వాటిని కరువు ప్రభావిత ప్రాంతాలుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్రలోని మొత్తం తాలూకాల్లో ఇవి 75 శాతం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆ తాలూకాల్లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాయితీలు, ఉపశమన చర్యలను ప్రకటించారు.
ఆయా జిల్లా కలెక్టర్లు పంట నష్టాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సీఎం ఆదేశించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత రైతులకు పంటనష్టపరిహారాలను అందించాలన్నారు. పంట నష్టం ఫొటోలతో పాటు జీపీఎస్ లొకేషన్లు కూడా ఉంచాలన్నారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించాలని డిమాండ్ చేశారు.