 
                                                            ‘హనుమాన్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న సూపర్‌హీరో చిత్రం ‘మహాకాళి’. అపర్ణ కొల్లూరు దర్శకురాలు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ని పోషిస్తున్న కథానాయిక వివరాలను తెలియజేస్తూ చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో భూమిశెట్టి మహాకాళి పాత్రలో కనిపించనుంది.
ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం ద్వారా భూమిశెట్టి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. దైవత్వం, కరుణ, ఆగ్రహం మూర్తీభవించిన అంశాలతో మహాకాళి డివైన్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది. కాళీమాత దుష్టశిక్షణను ఈ చిత్రంలో చూపించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాత: రివాజ్ రమేష్ దుగ్గల్, క్రియేటర్: ప్రశాంత్‌వర్మ.
 
                            