Bhumika Chawla | యువకుడు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ సుందరి భూమికా చావ్లా. ఆ తర్వాత రెండు దశాబ్ధాలకుపైగా సినీ కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తెలుగులో చివరగా సీతారామం, బట్టర్ఫ్లై సినిమాల్లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం హిందీలె కేసర్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా ప్రభావం (ఇన్ఫ్లుయెన్స్)గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాధ్యత, నమ్మకాలతో సోషల్ మీడియా ప్రభావం వస్తుందని అంటోంది భూమికా చావ్లా. ఆన్లైన్లో కనిపించే విషయమై ఈ భామ మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 1.9 మిలియన్ ఫాలోవర్లుండటం అంటే కేవలం పాపులారిటీ (ప్రజాదరణ) కంటే ఎక్కువ విషయమని చెప్పింది. అర్థవంతమైన కంటెంట్ ప్రాధాన్యతను పాయింట్ చేస్తూ.. ఒకవేళ నేను ఫాలోవర్లను పాజిటివ్ (సానుకూల మార్గంలో) మార్గంలో (ఇన్ఫ్లూయెన్స్) ప్రభావం చూపించకపోతే దాని వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించింది.
ఒంటరిగా ట్రెండింగ్ అవడం కంటే ఇన్ఫ్లూయెన్సర్లు తమ అప్రోచ్‌ను స్పూర్తిని కలిగించేందుకు, ప్రేరణ కలిగించేలా, అవగాహన కల్పించేందుకు ఉపయోగించాలని.. ప్రభావం అనేది అర్థవంతంగా ఉండాలని చెప్పింది. యువతలో అభిప్రాయాలను రూపొందించే శక్తి సోషల్ మీడియాకు ఉందని, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది భూమికా చావ్లా.