Bhumi Pednekar | ఎవరే అతగాడు
సినీ తారలు తమ ప్రేమ వ్యవహారాల్లో గోప్యత పాటించడం అంత సులభం కాదు. ఎంత దాచే ప్రయత్నం చేసినా ఏదో సందర్భంలో బయటపడుతుంది.
సినీ తారలు తమ ప్రేమ వ్యవహారాల్లో గోప్యత పాటించడం అంత సులభం కాదు. ఎంత దాచే ప్రయత్నం చేసినా ఏదో సందర్భంలో బయటపడుతుంది. బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్కు అదే పరిస్థితి ఎదురైంది. ఇటీవల ఈ భామ ముంబయిలో జరిగిన కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ విందుకు హాజరైంది. ఈ వేడుకలో భూమి పెడ్నేకర్ ఓ యువకుడితో రహస్యంగా సంభాషించడం..అనంతరం అతని నుదిటిని సుతారంగా ముద్దాడే దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. భూమి పెడ్నేకర్తో అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరో అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు ఆ వీడియోలో ఉన్నది ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త యష్ కటారియా అని తేల్చారు.
ఈ యువ వ్యాపారవేత్తతో భూమి పెడ్నేకర్ గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయితే వీటిపై ఆమె ఎక్కడా పెదవి విప్పలేదు. తాజా వీడియోతో ఈ భామ ప్రేమాయణం గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుంటున్నారు. బాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాల్లో సత్తా చాటుతూ ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది భూమి పెడ్నేకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

