Bhola Shankar | అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. ఈ సినిమాలోని ‘జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క’ అంటూ సాగే రెండో గీతాన్ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఆదివారం ఈ పాట తాలూకు ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి తనదైన శైలి హుషారైన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది.
చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను ముస్తాబు చేస్తున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: మామిడాల తిరుపతి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహర్ రమేష్.