Bhola Shankar Movie | వంద అడుగుల మెగాస్టార్ భారీ కటౌట్.. పీక్స్ లెవల్లో భోళా ప్రమోషన్స్
Chiranjeevi | విడుదలకింకా రెండు వారాలు కూడా లేని భోళా శంకర్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో వీర లెవల్లో హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మెగా అభిమానుల్లో మంచి జోష్‌ను నింపాయి. ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ సినిమా, అందులోనూ చిరు వీరాభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Chiranjeevi | విడుదలకింకా రెండు వారాలు కూడా లేని భోళా శంకర్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో వీర లెవల్లో హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మెగా అభిమానుల్లో మంచి జోష్‌ను నింపాయి. ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ సినిమా, అందులోనూ చిరు వీరాభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బిజినెస్ లెక్కలు సైతం సాలిడ్ రేంజ్లో జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు.
తాజాగా సూర్యపేట సమీపంలోని రాజుగారి తోట అనే రెస్టారెంట్ పరిసరాల్లో మెగాస్టార్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఎత్తు దాదాపు వంద అడుగుల పైనేనని సమాచారం. అంతేకాకుండా అంత పెద్ద కటౌట్ టాలీవుడ్లో ఇదే తొలిసారని చిత్రయూనిట్ వెల్లడించింది. దీన్ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రెండు వారాలు చిత్రయూనిట్ వరుస ప్రమోషన్లతో బిజీగా గడపనుందట.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు.
The countdown begins for the
MEGA FESTIVAL in theatres on August 11th💥🥁MegaStar @KChiruTweets’
MEGA MASSIVE Cutout Launched at Raju Gari Thota, Suryapeta🔥HIGHEST EVER CUTOUT IN TFI 😎❤️🔥
A film by @MeherRamesh@AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/S9HbRfYPaf
— AK Entertainments (@AKentsOfficial) July 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

