అంజిబాబు, ప్రసన్న, కీర్తి లత, అభి, కావేరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమదేవరపల్లి’. ఏబీ సినిమాస్, నీహాల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బత్తిని కీర్తిలత గౌడ్ నిర్మాత. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నిర్మాత రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా భీమదేవరపల్లిలోని సామాన్యుడి జీవనానికి అద్దం పడుతుందని దర్శకుడు అన్నారు.