అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’ నేడు ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నది. ఈ సందర్భంగా గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సకుటుంబ కథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని హీరో అమర్దీప్ చౌదరి అన్నారు.
ఈ కథలో అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుందని దర్శకుడు ఎం.ఎం.నాయుడు పేర్కొన్నారు. అందరికి అందుబాటులో ఉండేందుకు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మల్టీఫ్లెక్స్‌లో 150 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించామని నిర్మాత తెలిపారు. టేస్జీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.