బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం యావత్ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తి జైలు జీవితాన్ని గడిపారు. అయితే సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియా చక్రవర్తికి ఏం సంబంధం లేదని తీర్పు వెలువరిస్తూ గత ఏడాది సీబీఐ కేసును మూసి వేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా బాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది రియా చక్రవర్తి.
చివరకు నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్‌లో అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రియా చక్రవర్తి సోషల్‌మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడం ఆనందంగా ఉందని, ఈ క్షణాలను నమ్మలేకపోతున్నానని, కెరీర్ ముగిసిపోతుందనుకునే తరుణంలో తన ధైర్యమే కాపాడిందని రియా చక్రవర్తి పోస్ట్‌లో పేర్కొంది.