బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం నారా రోహిత్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అంశాలతో లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
నారా రోహిత్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. డివోషనల్, యాక్షన్ అంశాల కలబోతగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.