ఇంగ్లిష్ రాదని ఆటపట్టించేవారు!
తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చింది.
తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ కాలేజీ విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో ఆమె ఈ సంగతుల్ని వెల్లడించింది. ‘మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నా బాల్యం గడిచింది. అక్కడే మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్నా. కొన్నాళ్ల తర్వాత నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబమంతా నైజీరియాకు షిప్ట్ అయ్యాం. అక్కడ ఇంగ్లిష్ మీడియం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.
నాకేమో మరాఠీ, హిందీ తప్ప మరో భాష తెలియదు. ఇంగ్లిష్ రాదని స్కూల్లో అందరూ హేళన చేసేవారు. జోక్స్ వేస్తూ ఆటపట్టించేవారు. అయినా నేను ఏ మాత్రం కుంగిపోలేదు. అవహేళనలను ఛాలెంజ్‌గా స్వీకరించా. కొద్దిరోజుల్లోనే ఇంగ్లిష్‌పై పట్టుసాధించాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంగ్లీష్‌లో అనర్గళంగా ప్రసంగించే స్థాయికి చేరుకున్నా. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవొచ్చని నా స్కూల్ డేస్‌లోనే అర్థమైంది’ అని చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. ఇటీవలే ఈ భామ ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

