Bhagavanth Kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో వచ్చిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మంచి విజయం సాధించింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 30 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్‌వైడ్‌గా రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ.. ఈ సినిమా నవంబర్ 24 నుంచే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Telugu Film #BhagavanthKesari Will Premiere Tonight On Prime Video pic.twitter.com/iS1xmhOt5W
— Cinema World (@cinemaa_world) November 23, 2023
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.