Farhan Akhtar | బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన ఐకానిక్ చిత్రం భాగ్ మిల్కా భాగ్ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాను జూలై 18, 2025న దేశవ్యాప్తంగా PVR INOX థియేటర్లలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2013లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం సాధించింది. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనమ్ కపూర్, దివ్య దత్తా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తిరిగి విడుదల కావడం పట్ల ఫర్హాన్ అక్తర్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. మిల్కా సింగ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని మరోసారి పెద్ద తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని వారు పేర్కొన్నారు.