బెల్లకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అదితిశంకర్, ఆనంది, దివ్యపిైళ్లె కథానాయికలు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ గ్రామంలో వారాహి గుడి నేపథ్యంలో ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ కథ నడిచే కథ ఇది. ఒకరికోసం ఒకరు ఎంతవరకైనా తెగిస్తారు. ఈ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆసక్తినిరేకెత్తించింది. చివర్లో ముగ్గురు మిత్రులు దేవుని దీవెనలు పొందుతున్నట్లుగా డివైన్ ఎలిమెంట్‌తో టీజర్‌ను ముగించారు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కథాబలమున్న చిత్రమిదని, అందరికీ గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. సాయిశ్రీనివాస్, రోహిత్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని మంచు మనోజ్ తెలిపారు. ఈ సినిమాలో తనను సరికొత్త పాత్రలో చూస్తారని నారా రోహిత్ పేర్కొన్నారు. డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా మేకింగ్, విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత కేకే రాధామోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.