Bellamkonda Sreenivas | టాలీవుడ్ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి (Kishkindhapuri). అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మింస్తుండగా.. తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. గ్లింప్స్ చూస్తుంటే మంత్రాలతో మూసివేయబడిన ఒక పాత మహాల్‌లోకి హీరో తన అనుచరులతో కలిసి వెళ్లిన అనంతరం ఆ మహాల్లో ఏం జరిగిందనేది ఈ సినిమా అని తెలుస్తుంది. గ్లింప్స్‌లో చూపించిన సీన్స్ చూస్తుంటే ఉత్కంఠభరితంగా ఉండబోతోందని తెలుపుతున్నాయి.
పూర్తిగా కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందని.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలవనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.