Beauty producer | కొత్తదనంతో కూడిన కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసే నిర్మాతల్లో ఒకరు విజయ్ పాల్ రెడ్డి. వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌పై త్రిబాణధారి బార్బారిక్, బ్యూటీ సినిమాలను ప్రేక్షకులకు అందించారు విజయ్ పాల్ రెడ్డి. సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బారిక్.
కథను నమ్మి చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత ఇటీవల విడుదలైన బ్యూటీ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఈ మూవీ సక్సెస్ అందించిన జోష్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కించే పనిలో ఉన్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం విజయ్ పాల్ రెడ్డి ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడట. వీటిలో ఒకటి పాపులర్ యాక్టర్‌తో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ నిర్మాత కాంపౌండ్ నుంచి రాబోతున్న మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్లో తెరకెక్కుతున్నాయని సమాచారం. మరి రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టుల వివరాలపై క్లారిటీ రానుందట.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్