అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. వర్ధన్ దర్శకుడు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ అందమైన ప్రేమకథతో పాటు మిడిల్‌క్లాస్ ఎమోషన్స్‌ను టీజర్లో ఆవిష్కరించారు. స్కూటీ చుట్టూ ఈ కథ నడుస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతున్నది.
కథానాయిక స్కూటీ కావాలని ఎందుకు పట్టుపట్టింది? అది తీసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? అనే ప్రశ్నలతో టీజర్ ఆకట్టుకుంది. నేటి యువత కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: వర్ధన్.