‘ఒకే తరహా క్యారెక్టర్స్‌లో ఎన్నిసార్లని నటిస్తాం, మూస కథల్లో నటించడం నాకే కాదు చూసేందుకు ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది’ అని అంటున్నది అందాల తార తమన్నా. తను విభిన్నమైన చిత్రాలను ఎంచుకునేందుకు ఇదే కారణమని చెబుతున్నది. ఈ ఏడాది వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్ 3’ చిత్రంలో కనిపించిన తమన్నా, రెండు బాలీవుడ్ సినిమాలు ‘బబ్లీ బౌన్సర్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’లో నటించింది.
ప్రస్తుతం ఆమె చేతిలో సత్యదేవ్ సరసన నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’, చిరంజీవి ‘భోళా శంకర్’, హిందీ మూవీ ‘భోలే చుడియాన్’ ఉన్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ వేటికవి భిన్నమైనవని తమన్నా తెలిపింది. ఆమె మాట్లాడుతూ…‘ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తే విసుగొస్తుంది. నటిగా నా పరిస్థితీ అంతే. అవే కథలు, చేసిన పాత్రల్లోనే నటిస్తుంటే బోర్ కొడుతుంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు నటించేప్పుడు నాకూ సరదా, సంతృప్తి ఉండాలి. అందుకే వీలైనంత వరకు కొత్త తరహా కంటెంట్ ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పుడే నన్ను కొత్తగా తెరపై చూడగలుగుతారు.