‘పవన్‌కల్యాణ్ ‘గోకులంలో సీత’ టైమ్‌లో నేను పుట్టాను. ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో నాకు పవన్‌కల్యాణ్ అని నామకరణం చేశారు. నన్ను హీరో చేయాలనేది నాన్న కల. నాక్కూడా సినిమాలంటే ఇష్టం. అందుకే వైజాగ్ సత్యానంద్ వద్ద నట శిక్షణ తీసుకొని నాన్న కోరిక మేరకు ఈ సినిమాతో నటుడ్ని అయ్యాను’ అని యువనటుడు పవన్‌కల్యాణ్ బత్తుల అన్నారు. ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘పురుషః’. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. ఈ నెల 22న సినిమా విడుదల కానున్నది ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు పవన్‌కల్యాణ్ బత్తుల.
‘రెండున్నర గంటల పాటు ఆడియన్స్‌కి వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతోనే తొలి సినిమాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నాను. ‘క్షేమంగావెళ్లి లాభంగా రండి’ సినిమా మాదిరిగా అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇది. ఇందులో పాత్రలన్నింటికీ సమప్రాధాన్యత ఉంటుంది. కసిరెడ్డి, సప్తగిరిలతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంట్రోవర్ట్నైన నన్ను, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తెచ్చి, నాతో అద్భుతంగా నటింపజేశారు దర్శకుడు వీరు. ఇప్పటివరకూ ఈ సినిమా చూసిన వారంతా మెచ్చుకున్నారు. కచ్ఛితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని ఆశాభావం వెలిబుచ్చారు పవన్‌కల్యాణ్ బత్తుల.