ఎస్తేర్ నోరోన్హా, అజయ్ జంటగా దర్శకుడు పి సునీల్‌కుమార్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకాలపై బి. బాపిరాజు, ముతికి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు తెలిపారు. ‘సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇతివృత్తంగా తీసుకుని సినిమా రూపొందించాం. మా గత చిత్రాలు ‘రొమాంటిక్ ప్రేమకథ’, ‘గంగపుత్రులు’ తరహాలో ఉంటుంది’ అని అన్నారు దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి.