Chandrahas | చంద్రహాస్ హీరోగా రూపొందిన సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. మేఘనా ముఖర్జీ కథానాయిక. Sampath Rudra దర్శకుడు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ సినిమా టీజర్‌ని విడుదల చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. హీరో మాట్లాడుతూ ‘రెండో సినిమా ఎలా ఉండాలని ఆశించానో సరిగ్గా అలాంటి సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’.
దర్శకుడు సంపత్ సినిమాను క్లారిటీతో, క్వాలిటీగా తెరకెక్కించారు. అందరికీ నచ్చే సినిమా ఇది’ అన్నారు. ఉద్వేగభరిత ప్రేమకథగా సినిమాను మలిచానని దర్శకుడు చెప్పారు. కథను నమ్మి చేసిన సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. ఇంకా యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: ఎం.ఏ.తిరుపతి, మాటలు: రమేష్రాయ్, కెమెరా: వైఆర్ శేఖర్, సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్.