తెలంగాణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్ ‘బరాబర్ ప్రేమిస్తా’. చంద్రహాస్, మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ జంటగా నటిస్తున్నారు. సంపత్ రుద్ర దర్శకుడు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాతలు. ఫిబ్రవరి 6న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఫిబ్రవరి 16న బరాబర్ హిట్ కొట్టబోతున్నామని హీరో చంద్రహాస్ నమ్మకంగా చెప్పారు. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని దర్శకుడు సంపత్ రుద్ర తెలిపారు. అర్జున్ మహి, మురళీధర్‌గౌడ్, లక్ష్మణ్ మీసా తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: ఎం.ఎ.తిరుపతి, సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్, నిర్మాణం: సి.సి.క్రియేషన్స్, ఎ.వి.ఆర్.మూవీ వండర్స్.