సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు చాలా మందిని గందరగోళంలో పడేస్తున్నాయి. బ్రతికున్న వారినే చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం కామన్ గా మారింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ మోస్ట్ సింగర్ కమ్ కంపోజర్ బప్పి లహరికి సంబంధించి కొద్ది రోజులుగా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బప్పి లహరి కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆయన త్వరగానే కోలుకున్నారు. అయితే కరోనా సోకడం మూలాన అతని గొంతు పోగొట్టుకున్నారని పలు వార్తలు వైరల్ కాగా వాటి అన్నిటికీ బప్పీ తన గొంతు తోనే సమాధానం ఇచ్చారు. తన గొంతుతోనే పాట పాడి ఆ వీడియోని షేర్ చేసి తాను బాగానే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది. బప్పి లహరి కెరీర్ లో ఎన్నో హిస్టారికల్ హిట్ నంబర్స్ కూడా ఉన్నాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’ పాట దేశం మొత్తాన్ని షేక్ చేసింది.