కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిన సినిమా షూటింగ్స్ జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుండో ఊరిస్తూ వస్తున్న బంగార్రాజు కూడా జూలైలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్ అని సమాచారం. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్నాళ్లుగా పెండింగ్‌లో పడుతూ వస్తుంది.
తాజాగా బంగార్రాజు సినిమా జూలై రెండో వారం నుండి మొదలు కానుందని, ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్‌లో నాగ్ సరసన నటించి అలరించిన రమ్యకృష్ణ రెండో పార్ట్లోను నటిస్తుంది. నాగ చైతన్య కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు టాక్. నవంబర్ వరకు చిత్రీకరణ పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.