టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగార్జున లీడ్ రోల్ చేస్తున్న బంగార్రాజు (Bangarraju). 2016లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకుడు. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో నాగచైతన్య (Naga Chaitanya) జూనియర్ బంగార్రాజుగా సందడి చేయబోతున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
బంగార్రాజు నుంచి నాలుగో పాట ప్రోమోను జనవరి 5న సాయంత్రం 06:03 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బంగారా (Bangaara song) అంటూ చైతూ, కృతిశెట్టి మీద వచ్చే ఈ మాస్ సాంగ్‌ను అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుందని తెలుస్తోండగా..రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.