టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) జూనియర్ బంగార్రాజు (Bangarraju) గా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్కినేని నాగార్జున (Nagarjuna)నటిస్తోన్న బంగార్రాజు (Bangarraju) చైతూ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ చైతూ పుట్టినరోజు (Naga Chaitanya birthday) సందర్భంగా బంగార్రాజులో నాగచైతన్య పాత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్.
సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జున బంగార్రాజు గెటప్‌లో పంచెకట్టులో బుల్లెట్ బండిని నడిపిస్తున్న సీన్లు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ఇపుడు నాగచైతన్య ఈ సారి రూటు మార్చి బంగార్రాజు వాడిన వస్తువులను పెట్టుకుని..టోన్డ్ జీన్స్, పూల చొక్కాలో కర్రను గాల్లోకి ఎగిరేసి బుల్లెట్‌కు ఫిక్స్ చేశాడు. జూనియర్ బంగార్రాజులా స్టైలిష్ ఎంట్రీతో ఫుల్ టైమ్ వినోదాన్ని అందించడం ఖాయమని టీజర్ ద్వారా చెప్పాడు కల్యాణ్ కృష్ణ.
సీక్వెల్లో కూడా నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. నాగచైతన్య సరసన కోలీవుడ్ భామ కృతిశెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jr NTR New Movies Update | తన కొత్త సినిమాల గురించి చెప్పిన ఎన్టీఆర్
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు