Bandla Ganesh | కమెడీయన్‌గా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైన సభలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడుతుంటాడు. అయితే బండ్ల గణేష్ సినిమాలు తీసి చాలా కాలం అవుతోంది. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో వెరైటీ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే ఆ పాత్రపై చాలా విమర్శలు రాగా, ఇంకోసారి అలాంటి పాత్రల జోలికి వెళ్లనని అన్నాడు. రాజకీయాలకు ఇక దూరం అని బండ్ల గణేష్ ప్రకటించిన మళ్లీ రాజకీయాలతోనే బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసారు.
చంద్రబాబుకి వీరాభిమాని అయిన బండ్ల గణేష్ తాజాగా ఆయనని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.ఆ సమయంలో బండ్ల గణేష్ ముఖంలో సంతోషంతో పాటు కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది.బండ్ల గణేష్ ఇటీవల మాట్లాడుతూ..ఏడేళ్లుగా అంతు చిక్కని పరిష్కారం ఒకటి చంద్రబాబు వలన నిమిషాల్లో సమసిపోయిందని.. ఆ పని రెండు రోజుల్లోనే పూర్తయ్యిందని.. అది చంద్రబాబు ఘనత అని ఇటీవల గణేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తాను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు ఓ వ్యక్తి తనని ఆదుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో నా భార్య చంద్రబాబు గారిని కలవమని సలహా ఇచ్చింది.
నేను వెంటనే రాజగోపాల్ అన్నను సంప్రదించి ఆయన ద్వారా బాబుగారి అపాయింట్మెంట్ తీసుకున్నా. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లే ముందు ఆయన్ని కలిశాను. నా సమస్య విన్న వెంటనే ఆయన నన్ను సంబంధిత అధికారి దగ్గరకు పంపించారు. నమ్మండి నమ్మకపోండి, ఏడేళ్లుగా నాకు అంతుచిక్కని, సమస్య కేవలం నిమిషాల్లోనే సమసిపోయింది. ఆ పని కూడా రెండు రోజుల్లోనే పూర్తయింది అని బండ్ల గణేష్ ఆనాటి సంఘటనను చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా పంచుకున్నారు.