నటుడిగా కెరీర్‌ను ఆరంభించి ఆ తర్వాత నిర్మాతగా రాణించారు బండ్ల గణేష్. రవితేజ ‘ఆంజనేయులు’ చిత్రం ద్వారా ఆయన ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్’ ‘బాద్షా’ ‘టెంపర్’ వంటి పలు హిట్ చిత్రాలను అందించారు. తాజాగా ఆయన ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ (బీజీ బ్లాక్‌బస్టర్స్) పేరుతో నూతన నిర్మాణ సంస్థను నెలకొల్పారు.
కొత్త ఆలోచనలు, వినూత్న కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఔత్సాహికులను ప్రోత్సహించడమే కొత్త బ్యానర్ ఉద్దేశ్యమని తెలిపారు. బీజీ బ్లాక్‌బస్టర్స్ పతాకంపై వరుస సినిమాలకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నదని మేకర్స్ తెలిపారు.