bandla ganesh | కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. పెద్ద సినిమాలతో ఒక్కసారిగా సంచలన నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేశ్. చాలా ఏళ్ల తర్వాత ఈయన మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఇటీవల ఈయన హీరోగా కూడా మారాడు. నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ మొదలైంది. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం” అని చెప్పారు.
ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం గాంధీ అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా అరుణ్ దేవినేని ఉన్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా మాటలు రాస్తున్నారు. లైనస్ మధిరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకుడు. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. హిందీ వర్షన్‌కు పార్తీబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లోనే జూనియర్ బచ్చన్ గాయపడ్డాడు జూనియర్ బచ్చన్. మరి చూడాలిక.. కమెడియన్, నిర్మాతగా పర్లేదు అనిపించిన బండ్ల గణేష్.. హీరోగా ఏం చేస్తాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..