ఆదిత్య ఓం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బందీ’. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆదిత్యం ఓం హీరోగా సింగిల్ క్యారెక్టర్‌తో ఈ సినిమాను తీశాం. స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలని కోరుకునే ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
ఒకే ఒక పాత్ర అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ను జరిపాం. పర్యావరణ సంరక్షణ మీద రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు.