బాలు, స్నేహ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకుడు. వెంకట్రావ్ మోటుపల్లి నిర్మాత. అక్టోబర్ 6న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఇదొక భిన్నమైన కథాంశమని, పైరసీకి తావులేని విధంగా సినీబజార్ని తీర్చిదిద్దామని సినీబజార్ డిజిటల్ థియేటర్ సి.ఇ.ఓ వెంకటేశ్ చెప్పారు. ఈ సినిమా ద్వారా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నందుకు బాలు, స్నేహ ఆనందం వ్యక్తం చేశారు. వెంకట్రావ్, గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ భాస్కరుని, ఎడిటింగ్: శంకర్ బోలం.