Bald For Bugonia | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు యోర్గోస్ లాంథిమోస్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘బుగొనియా’ (Bugonia). ఈ చిత్రం అక్టోబర్ 24 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర బృందం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శనకు ఉంచగా.. ఈ సినిమాను ఉచితంగా చూడాలనుకునే ప్రేక్షకులకు ఒక షరతును విధించింది. ఈ చిత్ర ప్రీమియర్‌ను ఉచితంగా చూడాలనుకునే ప్రేక్షకులు గుండు కొట్టించుకుంటే చూడవచ్చని తెలిపింది. దీంతో ఈ ఆఫర్ కోసం చాలామంది జనాలు ఎగబడ్డారు. చిత్రబృందం కూడా ప్రేక్షకుల గుండు కొట్టించుకోవడానికి ప్రత్యేకంగా బార్బర్‌ని ఏర్పాటు చేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రేక్షకులను గుండు కొట్టించుకోమనడానికి ముఖ్య కారణం ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటి ఎమ్మా స్టోన్ గుండులో కనిపించడమే. ఈ చిత్రంలో ఎమ్మా సీఈఓ మైఖేల్ ఫుల్లర్ పాత్రలో నటిస్తుంది. ఆమెను సడన్‌గా ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి గుండు కొట్టిస్తుంది. అయితే ఎమ్మాను కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
People getting their heads shaved at the free bald screening of ‘BUGONIA’. pic.twitter.com/7VOzpYseqB
— DiscussingFilm (@DiscussingFilm) October 21, 2025