Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో స్టార్ నటుడు విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. వెంకీమామ మన శంకరవరప్రసాద్‌గారు సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు నటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025