akhanda vs ghani | నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 50 కోట్ల బిజినెస్ చేస్తుంది అఖండ సినిమా. తాజాగా విడుదలైన అఖండ సినిమా ట్రైలర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. విడుదలైన మరుక్షణం నుంచి యూట్యూబ్‌లో రికార్డులు నమోదు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్‌కు మింగుడు పడటం లేదు. ఎందుకంటే వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా డిసెంబర్ 3న విడుదల కానుంది.
గని సినిమా రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల కిందటే దర్శక నిర్మాతలు ఇచ్చారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద అబ్బాయి అల్లు వెంకటేష్ ( బాబీ ) నిర్మిస్తున్నాడు. ఆయన నిర్మాణంలో వస్తున్న తొలి సినిమా ఇదే. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు వరుణ్ తేజ్. డిసెంబర్ 3 శుక్రవారం కావడంతో సోలోగా రావాలని ముందు నుంచి ప్రిపేర్ అయ్యాడు మెగా హీరో. కానీ ఊహించని విధంగా ఇప్పుడు గురువారం అంటే.. డిసెంబర్ 2న అఖండ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే వరుణ్ తేజ్ సినిమాకు గట్టి పోటీ తప్పదేమో అనిపిస్తుంది. ఒకవేళ బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. గని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సిందే. లేదంటే బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న అఖండ సునామీలో గని గల్లంతవ్వడం ఖాయం. మొత్తానికి చూడాలి మరి బాలకృష్ణ, వరుణ్ తేజ్ వార్ లో విజయం ఎవరిని వరిస్తుందో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda trailer | బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. మాస్ డైలాగులతో అఖండ ట్రైలర్
Ghani | సిక్స్ ప్యాక్ బాడీ.. సిక్స్ ఫీట్ కటౌట్.. గ్రీకు శిల్పంలా వరుణ్ తేజ్..
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
allu bobby | అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?
Shyam Singha Roy | ‘అఖండ’ వస్తే ‘శ్యామ్ సింగరాయ్’ ఆగిపోతాడా..?
ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?