Akhanda Trailer | అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తోమా.. ఒకమాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. .. ఇలా మాస్ డైలాగులతో అఖండ ట్రైలర్ ( Akhanda Trailer ) అంతా రచ్చ రచ్చే.
సాధారణంగా బాలకృష్ణ సినిమాలపై అంచనాలు మునుపటిలా ఇప్పుడు కనిపించడం లేదు. కానీ ఒకవేళ ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తే అంచనాలతో పాటు బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది. బాలయ్య సినిమాలకు మామూలుగా రూ. 30 కోట్లకు బిజినెస్ జరిగితే.. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే 60 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు అఖండ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. గత పదేళ్లలో బాలకృష్ణకు సింహ, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో రెండింటికి బోయపాటి శ్రీను దర్శకుడు. దాన్ని బట్టి వారిద్దరి కాంబినేషన్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే మూడోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
నిజానికి బాలయ్య ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ దారుణంగా నిరాశపరిచాయి. అలాగే వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి కూడా ప్లాప్ ఇచ్చాడు. ఇలాంటి సమయంలో అఖండ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటి వరకూ విడుదలైన అఖండ స్టిల్స్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ట్రైలర్ కూడా అదిరిపోయింది. అది చూసిన తర్వాత బిజినెస్ కూడా భారీగా పెరుగుతుంది. మరి ఇంత టార్గెట్ అందుకోవాలంటే బాలయ్య-బోయపాటి బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేయాలి. డిసెంబర్ 2న సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?
Shyam Singha Roy | ‘అఖండ’ వస్తే ‘శ్యామ్ సింగరాయ్’ ఆగిపోతాడా..?
ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Unstoppable: తేదేపా పగ్గాలు ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నకు బాలయ్య సమాధానం ఏంటి?