దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం వేట మొదలైంది అంటున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే సెట్స్‌మీదకు వెళ్లిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం సిరిసిల్లలో షూటింగ్ జరుగుతున్నది. సోమవారం బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన రగ్డ్లుక్లో కనిపిస్తున్నారు. ముంజేతితో పాటు మెడలో రుద్రాక్షలు ధరించిన ఆయన ఆహార్యం వైవిధ్యంగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ ‘బాలకృష్ణను మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఆవిష్కరించబోతున్నాం. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం సిరిసిల్లలో రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.